సంక్రాంతి లక్ష్మి



 

సంక్రాంతి లక్ష్మి

జగదానంద కారకుడు

జగత్పర్తి పాలకుడు

అయిన 

శ్రీ కృష్ణ పరంధామునికి 

నా శిరసా నమస్కారం


ఆ జగన్మోహనాకారుడి పట్ల నా అచంచల భక్తి వల్లో

ఆయన గాధలపట్ల అభిమానం వల్లో

లేక మరే ఇతర కారణం వల్లో తెలియదు కానీ


విశాలాకాశాన్ని చూస్తే

అది విశాలాక్షుడి విశాల హృదయమనిపిస్తోంది


అపార సముద్రాన్ని చూస్తే

అది ఆ అవ్యాజకరుణామూర్తి శరీర వర్ణమనిపిస్తోంది


పచ్చని ప్రకృతిని చూస్తే 

అది ఆ పరంధాముడి పట్టుపీతాంబరం అనిపిస్తోంది


కోనేరులోని తామరపూల రేకులని చూస్తే

ఆ రాధామనోహరుని కన్నులు ఇలానే ఉంటాయేమో అనిపిస్తోంది 


నిశి వేళ చిమ్మ చీకటిని చూస్తే

అది ఆ నవనీతచోరుడి నల్లని కేశాల ఒత్తుతనం అనిపిస్తోంది


నదుల మధ్యలోని పచ్చని మొక్కలతో కూడిన ఇసుకదిబ్బలని చూస్తే

అది ఆ ఆశ్రితవత్సలుడి తలపై ఉండే నెమలిపించపు కన్ను అనిపిస్తోంది


ఇళ్ళముందు వేసిన రంగురంగుల రంగవల్లులను చూస్తే

అది ఆ కరుణామయుడి కంఠహారం లోని రంగురంగుల పువ్వులనిపిస్తోంది


చల్లగా వీచే గాలి సవ్వడి చూస్తే

అది ఆ వేణు గోపాలుడి వేణునాదం అనిపిస్తోంది


ఒక్కటేమిటి?
ఎటు చూసినా
ఏం చూసినా 
ఏం చేసినా

ప్రకృతిలోని అణువణువూ కృష్ణమయం
సర్వం కృష్ణమయం
శ్రీ కృష్ణమయం


ఆ కృష్ణుని చేరుటకు లక్ష్మియే వచ్చింది సంక్రాంతిలా

బోగిపళ్లు పోయించుకుంటున్న పసిపాప నవ్వులా
అల్లుళ్లకి మర్యాద చెయ్యాలనీ ,అవీ ఇవీ వండిపెట్టాలని
ఆరాటపడే అత్తగారిలా
కమ్మని పిండి వంటలు అరిసెలూ ,సున్నుండలులా
ఇంటి ముంగిట రంగవల్లులలోని గొబ్బెమ్మలా
గాలి పటాల జోరులా
కోడి పందేల హుషారులా
హరిదాసుల ,గంగిరెద్దులా సందడిలా
అలా
అలా
సర్వజీవుల మానసికోల్లాస  తరంగంలా

Comments