Posts

సంక్రాంతి లక్ష్మి

Image
  సంక్రాంతి లక్ష్మి జగదానంద కారకుడు జగత్పర్తి పాలకుడు అయిన  శ్రీ కృష్ణ పరంధామునికి  నా శిరసా నమస్కారం ఆ జగన్మోహనాకారుడి పట్ల నా అచంచల భక్తి వల్లో ఆయన గాధలపట్ల అభిమానం వల్లో లేక మరే ఇతర కారణం వల్లో తెలియదు కానీ విశాలాకాశాన్ని చూస్తే అది విశాలాక్షుడి విశాల హృదయమనిపిస్తోంది అపార సముద్రాన్ని చూస్తే అది ఆ అవ్యాజకరుణామూర్తి శరీర వర్ణమనిపిస్తోంది పచ్చని ప్రకృతిని చూస్తే  అది ఆ పరంధాముడి పట్టుపీతాంబరం అనిపిస్తోంది కోనేరులోని తామరపూల రేకులని చూస్తే ఆ రాధామనోహరుని కన్నులు ఇలానే ఉంటాయేమో అనిపిస్తోంది  నిశి వేళ చిమ్మ చీకటిని చూస్తే అది ఆ నవనీతచోరుడి నల్లని కేశాల ఒత్తుతనం అనిపిస్తోంది నదుల మధ్యలోని పచ్చని మొక్కలతో కూడిన ఇసుకదిబ్బలని చూస్తే అది ఆ ఆశ్రితవత్సలుడి తలపై ఉండే నెమలిపించపు కన్ను అనిపిస్తోంది ఇళ్ళముందు వేసిన రంగురంగుల రంగవల్లులను చూస్తే అది ఆ కరుణామయుడి కంఠహారం లోని రంగురంగుల పువ్వులనిపిస్తోంది చల్లగా వీచే గాలి సవ్వడి చూస్తే అది ఆ వేణు గోపాలుడి వేణునాదం అనిపిస్తోంది ఒక్కటేమిటి? ఎటు చూసినా ఏం చూసినా  ఏం చేసినా ప్రకృతిలోని అణువణువూ కృష్ణమయం సర్వం కృష్ణమయం శ్రీ కృష...